Sunday 17 May 2015

వృధా ఖర్చు


అసూయ



ఆడపిల్ల పుట్టింటి నుండి అత్తోరింటికి వెళ్ళగానే తన పుట్టింటితో అనుబంధమూ, హక్కులూ పోయాయని దూరమయ్యారు అని భాధపడుతుంది. అలాంటిదేమీ లేదు ఈ ఇంటిలో నీ హక్కు అలానే ఉంటుంధనిచేప్పి , వివాహ సమయం లో తోడపుట్టినవాడిని పెండ్లి కొడుకుని చేయించడం దగ్గరనుండి ఆమెకి లాంచనాలు ఇప్పించటం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మొగపిల్లలు పట్టించుకోరేమో నని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పని సరి అని , ఆమె చేతులు మీదగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పటమే ప్రధాన ఉద్దేశం. ఇంటి ఆడపడుచుకి ఎంత ప్రాముఖ్యత ఉందో మా అత్తగారు నాకు చెప్పిన మాటలు ఇవి.