Thursday, 6 April 2017

మాట ధర్మాన్ని నిలబెట్టడానికి పనికి రావాలే తప్ప , మాట అవతల వ్యక్తిని పాడు చేసేదిగా ఉండకుడదు .కొంతమంది ఎదుటివారి మెప్పు పొందేలా ఆకర్హణీయంగా మాట్లాడతారు .అదేమీ గొప్పకాదు .మాట ఎదుటివారిని ఉద్దరించేలా ఉండాలి .ఎదుటి వారి శ్రేయస్సుని ఆకాంక్షించే వారి నోటివెంట మాట రాకపోయినా వారి సాంగత్యం గొప్ప ప్రభావం చూపుతుంది .
మనకి ధనము ఉందికదా మనం ఏమిచెప్పినా వింటారు అని అవతల వారిని లోకువ కట్టడం ఎగతాళి మాటలతో హింసించడం ..అదే పనిగా విమర్శించడం తగదు . .ఎదుటివారి మెప్పుకోసం మరొకరిపై నిందలు వేయడం అవతలవారిని దోషులుగా చిత్రీకరించడం ఘోర పాపక్రుత్యమవుతుంది .సంతోషంగా ఉండే మనసులను విడదీయడం కల్మషం తో నింపడం హత్యచేయడం తో సమానం అవుతుంది.
చెప్పుడు మాటలకూ అధిక విలువ ఇస్తూ వ్యక్తుల మద్య కుటుంబాల మద్య చిచ్చు పెరుగుతూ ఎన్నో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయ్.సాధారణం గా మనిషికి హితువు పలుకుతూ చెప్పెమాటలకన్నా చాడీలు, నిందలు ,ఆరోపణలు వంటి దుర్గుణాలు మాటలు చెవులకి ఇంపుగా ఉంటాయి .ఇంపుగా ఉండటమే కాక అప్పటివరకు తమకు అనుకూలమైన వాతావరణం ,మనుషులు దోషపూరితంగా కనిపిస్తారు .ఎవరినో మెప్పించడానికో మన గొప్పలు వినిపించాదానికో ఎదుటివారి కష్టపెట్టడం మంచిది కాదు .వారికీ తెలియనంతకాలమే మన ఆటలు . తెలిసాక బంధం కాస్త పుటుక్కున ఊడిపోతుంది.అతకాలన్నా అతకదు.
ఒక్క మాట మాట్లాడటానికి నిజానికి ఎంతగానో ఆలోచించాలి .మాట ఒక్కోసారి జీవితాలను తిప్పేయగలడు .శాసించనూగలడు..మన  మాట  ఇతరులకి  మేలు చేసేది  కానప్పుడు  మౌనం  వహించడమే  మంచిది .ఇది  నేను  నా   మనసులో    అనుభవిస్తున్న  వేదన. 

No comments:

Post a Comment