Sunday, 8 October 2017

Atla Thaddi Quotations and Greetings

అందరికీ "అట్లతద్ది" శుభాకాంక్షలు. ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది.చంద్రకళలో గౌరీదేవిని ఆరాధించే తిధి ఇది.తెల్లవారున లేచి స్నానమాచరించి తూర్పు దిక్కున మండపం ఏర్పాటుచేసి గౌరీ పూజ ఆచరిస్తారు . 11 రకాల పూలు , ఆకులుతో 11 ముడులు వేసిన తోరాన్ని గౌరీ దేవి ముందుంచి పూజ చేసి, పూజ అయిన తదుపరి ముతైదువులను కూర్చుండబెట్టి ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు.
అట్లతద్ది సందేశం! స్నేహభావం తో అందరూ కలసిమెలసి ఉండాలనీ , దానం చెప్పుకుంటే పుణ్యం పోతుంది అందుకే వాయనం ఇచ్చినపుడు చెంగు మూసి ఇస్తారు ..దానం ఆవిధంగా చేయాలనీ చెప్పడం .దానం గ్నుప్తంగా చేయాలి . మనదగ్గర ఉన్నదాన్ని ఎదుటి వారికి ఇవ్వాలి . పది మందికి పంచాలి అని అట్లతద్ది చెపుతుంది పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది

No comments:

Post a Comment