Wednesday, 28 June 2017

Onion Story

ఒకా నొక వూరిలో వొక ఉల్లిపాయ, టమాటో, పర్చిమిరపకాయ, మంచుగడ్డ మంచి స్నేహం గా వుండే వాళ్ళు..
నలుగురు కల్సి పట్నం వెళ్లి బాగా తిరిగి
సాయంత్రం వేళ బీచ్ కి వెళ్ళారట..
అక్కడ ఆడుకుంటుండగా.. పెద్ద అల వచ్చింది..
మంచుగడ్డ ఏమో పాపం కరిగిపోయింది.. మిగిలిన
స్నేహితులేమో అయ్యో మా ఫ్రెండ్ చనిపోయిందే అని
బాధ పడ్డారు..
తర్వాత రోజు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ
ముగ్గురు కల్సి సినిమా కి వెళ్తారు.. వొక అతనేమో
చూసుకోకుండా టమాటో మీద కూర్చుండి
పోతాడు..
ఇంకేముంది అయ్యో మా ఫ్రెండ్
చనిపోయాడే అని ఉల్లిపాయ, పర్చిమిరపకాయ
ఏడుస్తారు..
బయటకి వచ్చి రోడ్ పక్కగా నడస్తూ వుంటారు..
ఇంతలో బజ్జీల బండి అతను అరె నా మిరపకాయ
పడిపోయిందే అని దీనిని తీసే నూనెలో వేసేస్తాడు..పాపం కదా..
ఉల్లిపాయ వోకర్తే ఏడుస్తూ. మంచు గడ్డ చనిపోతే
నేను, టమాటో, పర్చిమిరపకాయ ఎడ్చాము..
టొమాటో చనిపోతే నేను, పర్చిమిరపకాయ ఎడ్చాము
పర్చిమిరపకాయ చనిపోతే నేను ఏడ్చాను..
నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు దేవుడా అని బాధ
పడిందట..
అంతే.. దేవుడు అసలే జాలిగుండె కలవాడు కదా..
నిన్ను చంపిన వాళ్ళే ఏడుస్తారు అని
వరం ఇచ్చేసాడు..

From Old collection

No comments:

Post a Comment