Monday, 31 July 2017

Chandra Grahanam August 7th 2017

. చంద్ర గ్రహణం రాత్రి 10.52 ని: నుండి 12.48 వరకు మధ్య కాలము ఉంటుంది .. ఇండియాలో ఐతే ఈ గ్రహణం సుమారు 5 గంటల 1 నిమిషం పాటు ఉంటుంది. ఈ గ్రహణం పాక్షికంగా1గంట 53 నిమిషాల సేపు ఉంటుంది..ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ నక్షత్ర జాతకులు, సిం హ, మకర ,కుంభ రాశుల వారు గ్రహణ శాంతి చేసుకొవాలి  .  అందరూ  గ్రహణానికి 3 గంటల ముందు ఏమి ఆహరం తీసుకోకుడదు.గ్రహణం రోజు ఉదయాన్నే తల స్నానం చేయాలి . గ్రహణం పట్టకముందు పట్టు స్నానము , గ్రహణం విడిచాక విడుపు స్నానము అనేటటువంటి 2 స్నానాలు చేయాలి .శ్రవణా నక్షిత్రం వారు మకర రాశివారు గ్రహణ సమయములో చంద్రుని కాంతి లోకి వెళ్ళకుండా ఉండడం మంచిది.  ఆ రోజు రాఖీలు కట్టరాదు అన్న వుదంతులు వస్తున్నవి . అవి నమ్మరాదు రాఖి పండుగను యధావిధం గా జరుపుకోవచ్చు . అలాగే గర్భవతులు గ్రహణం అంటే ఎంతో భయపడతారు .కానీ చంద్ర గ్రహణం విషయంలో అంత భయపడవలసిన పని లేదు . గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటె  సరిపోతుంది . సూర్యగ్రహణం అయితేనే అతినీల లోహిత కిరణాలు    [ Ultra Violet Rays ] తీవ్రత కారణం వలన ప్రమాదం ఉంటుంది .శుభం.

No comments:

Post a Comment