Monday 3 July 2017

Jai Sri Ram

రామ నామాన్ని జపిస్తూ మహత్కార్యాలు చేసిన మహాత్ములు ఎందరో ఉన్నారు . వారి విజయానికి మార్గం తారక మంత్రమే.జయ జయ శ్రీ రామా అంటూ సుగ్రీవుడు సైన్యం బండరాళ్ళు తెచ్చిసముద్రంలో వేస్తుంది. ఆంజనేయుడు వినయం గా నమస్కరించి రామకార్య భారాన్ని వహిస్తున్నాను ఈ సమయం లో ఇటువంటు ఆటంకం కలిగించడం నీకు భావ్యమా దయచేసి వెసులబాటు ఇవ్వండి .అని అడిగినపుడు , రామబంటు మాటలకు శనీస్వరుడు కరిగిపోయి 'పవన పుత్రా నీవు చేస్తున్న పరమ పవిత్ర కార్యం సంగతి నాకు తెలియనిది కాదు.కానీ తల రాతను తప్పించాలేము .అయినా కూడా నీకు ఒక్క అవకాం ఇస్తున్నాను ...నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని ఆవహిస్తాను...ఎక్కడ ఉండమంటావో నీవే చెప్పుము ..అన్నాడు దయతో శనీస్వరుడు.

మేధావి అయిన హనుమ శిరస్సు వంచి ఇదిగో నా శిరస్సుపైభాగన్న అధిరోహించు అని ఆంజనేయుడు ప్రార్ధించాడు శని ఆశ్చర్యపోతూ ,మారుమాట్లాడకుండా ఆంజనేయుని శిరస్సుపైకెక్కి కూర్చున్నారు. . ఆంజనేయుడు వెంటనే ఒక పెద్ద బండరాయి తెచ్చి తన తలపైకి ఎత్తుకున్నారు .అక్కడ ఉన్న శని ఆరాయి బరువును భరించలేక వెంటనే కిందకు దూకాడు . ఆంజనేయ స్వామి ! రామకార్యాన్ని నిర్వగ్నంగా నిర్వహించుకో ...ఒక్క క్షణంలో ఏడున్నర సంవత్సరాలు పుర్తిచేసినట్టయింది నా పని. నీకో నమస్కారం .అన్నాడు శని . శనిదేవా విధిని తప్పించలేము .ఊరికే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఎలా? రా వచ్చి నా తలపై కూర్చో అన్నాడు హనుమ . మహాత్మా ని వంటి రామ భక్తులైన వారికి ఏ రాతలు వర్తించవు .నన్ను వదిలిపెట్టు వెళ్ళిపోతాను ..అని నమస్కరించాడు శని ..సరే ఒక్క నియమం పై వదిలిపెడుతున్నాను ' శ్రీరామ శ్రీరామ ' అని స్మరిస్తూ పనులు నిర్వహించే వారి వద్దకు వెళ్లను అని మాట ఇవ్వు ' అని కోరాడు ఆంజనేయుడు . శనీస్వరుడు పరమ సంతోషంతో ఆ వరం ప్రసాదించి .తానూ రామ నామం జపిస్తూ వెళ్ళిపోయాడు .కపివీరులు తమ పనిని కొనసాగించారు. ఆటంకాలన్ని వాటంతట అవే తొలగిపోయాయి. అపూర్వమైన రామసేతువును అచిరకాలంలో నిర్మించారు .(ఈనాడు సౌజన్యంతో )

No comments:

Post a Comment