Wednesday 16 August 2017

Bhagavad Gita Quotations




ఈ జగత్తులో జన్మించే ప్రతీ శిశువు ఎటువంటి గుణ దోషాలు లేకుండా జన్మిస్తాడు .జన్మతహ పిల్లల్లో ఎటువంటి గుణదోషాలు ఉండవు . .వాని అంతరాత్మలో ఎటువంటి సత్ సంస్కార లక్షణాలు కానీ దుస్సంస్కార లక్షణాలు కానీ ఉండవు . .తమ తల్లి తండ్రుల నోట నిరంతరమూ వినే మాటల యొక్క ప్రభావమే వాళ్ళ సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చి దిద్దు తుంది . అమ్మా నాన్నల  మనసులోని కోరికలే వారి సంతానాని కున్నసంస్కారం లోని  దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి..పిల్లలు చెడు మార్గంలో పయనిస్తున్నప్పుడు, తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందా అని వారి హృదయం వారిని నిలదీసి అడుగుతుంది . తమ సంతానం ధర్మబద్దం గానూ , సంస్కారవంతులుగానూ ఉండాలని ఆశించే ప్రతీ తల్లి తండ్రులూ ముందుగా తన మనసులోని కోరికలను నియంత్రించు కోవడం అనివార్యం

Monday 14 August 2017

Devotioal

Independence Day Greetings and images

Bhagavad Gita Quotations

ఇతరుల ధర్మబద్దమైన సలహాలు ,సూచనలు ఆచరించాలంటే ఏ వ్యక్తి కైనా ధర్మం ఉండాలి . అనగా ఇతరుల నుండి సూచనలు సలహాలు స్వీకరించే ముందు మన హృదయాలలో ధర్మాన్ని ప్రతిష్టించు కోవాలి .ఇది యదార్ధం.

Sunday 13 August 2017

Independence Day Greetings and images

Bhagavad Gita Quotations

ఎప్పుడైనా , ఒక మనిషికి ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఆ ఘటన వారి అంతరంగాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది .అన్యాయం జరిగిన ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయంలో  కూడా అంతే నిరోధించ సాగుతుంది . సమస్త జగత్తు అతనికి శత్రువులు వలే కనిపిస్తుంది. మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది . అఘటనకు బదులుగా వారు న్యాయము అడుగుతారు . అది సరి అయినదే కానీ ఎవరి హృదయంలో ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు . తమకు కలిగిన భాధ కంటే ఎక్కువ భాదను కలిగించే ప్రయత్నం చేస్తారు .. అన్యాయంకు బలైనవారే స్వయంగా అన్యాయం చేసి వారూ అపరాదులు అవుతారు . అనగా న్యాయానికి , ప్రతీకారానికి మద్య బహు తక్కువ అంతరమే ఉంటుంది ..అలాంటి అంతరంగం పేరే ధర్మం

Friday 11 August 2017

Fear is preamble of impending imaginative sorrow




మానవుల హృదయాలయందు భయం ఎప్పుడూ కొలువుదీరి ఉంటుంది .ఇలా భయం కలగడం మన అందరికి సహజమే .ఇంతకీ ఏ స్థితి లేక వస్తువు భయానికి కారణం అవుతుందో , వాస్తవానికి దానివల్లే మనకి దుఖం కలుగుతుందా ..లేదు ..అలా కలిగి తీరాలని అని లేదు .ఈ భయనికి గురి కావడం వల్ల భవిష్యత్తులో దుఖానికి అది నివారణ కాదు . రానున్ను దుఖం యొక్క కల్పన మాత్రమే !వాస్తవికతో దీనికి ఎట్టి సంభందమూ లేదు. భయం అంటే ఏదో కాదు అది కేవలం వట్టి కల్పనే అని తెలుసుకొని దాని నుండి విముక్తులై నిర్భయులవడం అనునది ఏమంత కఠినం కాదు. .

Help more than required doesn't give satisfaction and leads to punishment

Monday 7 August 2017

Devotional Quotations and Images

మన తప్పులే విధి బాణాలై మనల్ని అంపశయ్య మీదకు చేరుస్తాయి.జీవితం అందరికీ పూలశయ్య కాదు. కానీ, అంపశయ్య కాకుండా చూసుకోవాలి.

Wednesday 2 August 2017

How can trees live if we close the land with cement? Trees only can save us from burning Sun.

చెట్టు మానవ మనుగడకు తొలి మెట్టు. చెట్టు లేని ప్రపంచంలో  మనిషికి  కూడా స్థానం లేదు .  నేనోక చిలకను పెంచాను... ఎగిరిపోయింది. నేనోక ఉడతను పెంచాను.. పారిపోయింది.. నేనోక చెట్టు పెంచాను అంతే చిలక, ఉడతా ఇంకా పక్షులు వచ్చేసాయ్.. చెట్లను పెంచండి " చెట్టు పదికాలాలపాటు పచ్చగుంటే పదిమందికి నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది, స్వఛ్ఛవాయువునిస్తుంది. ఇన్ని ఇస్తున్నా ఆ పచ్చని చెట్టెప్పుడూ తానిన్ని ఇస్తున్నా కదా అని గర్వపడదు.
చెట్ల చుట్టూ సిమెంట్ తో గట్టు వేస్తున్నారు . రోడ్డు పక్కన చెట్లు ఇంటి ఆవరణలో చెట్ట్లు చుట్టూ సిమెంట్ చేయడం వలన ఎంత వర్షం పడినా చెట్టు వేరుకు నీరు అందటం లేదు .మనిషికి ఎంత స్వార్ధం . ఆ చెట్టు నీడలోనే సేదాతీరుతున్నాం కాని ఆ చెట్టు నీరు అందకా ఎండిపోతున్నా పట్టించుకునే వారే లేరు . చెట్టు లేని నాడు మనిషి మనుగడే లేదన్న విషయం గురుతు ఉంచుకొని చెట్టుని కాపాడుకోవలసిన భాద్యత మన అందరిపై ఉంది . పెరిగే ప్రతి చెట్టూ.. ప్రగతికి మెట్టు ! పర్యావరణానికి అదే ఆయువుపట్టు !!

An elephant rescued from 50 years turture

ఈ గజరాజు పేరు రాజు . సుమారు యాభై సంవత్సరాల క్రితం కొందరు వేటగాళ్ళు ఒక గున్న ఏనుగును దాని తల్లి నుండి వేరుచేసి దానికి రాజు అని పేరు పెట్టారు .ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో ఈ గున్న ఏనుగును ముళ్ళు కలిగిన సంకెళ్ళతో , కొంచంకూడా కదలనీయకుండా బంధించారు .అత్యంత క్రూరుడు తాగుబోతు అయిన మావటి దానికి కనీసం సరియైన మేత, నీరు, నీడ కల్పించని ఆ క్రూరుడు ,సందర్శకులు ఇచ్చిన చిల్లర పైసలు పైనే తప్ప, దాని పోషణ పట్టించుకున్న పాపాన పోలేదు . సందర్శకులు దయతో అందించే నామమాత్రపు పళ్ళు తో పాటు కాగితాలు,  ప్లాస్టిక్ సంచులతో కడుపు నింపుకునే దయనీయ స్థితి లో యాభై సంవత్సరాలుగా గడిపింది.దానికితోడు తుప్పుపట్టి వాడిగా ఉన్న ముళ్ళసంకెళ్ళ వలన ఏర్పడిన గాయాలతో చీము పట్టి నడవలేని పరిస్థితి వలన తీవ్ర ఇబ్బందులకు గురి అయినది . ఏనుగుని పవిత్ర జంతువుగా , వినాయకుని దేవునిగా భావించే మన భారతదేశంలో ఒక గజరాజుకి ఇలాంటి దయనీయ స్థితి ఏర్పడటం మానవత్వానికే తీరని మచ్చ .

రాజు యొక్క దయనీయ పరస్థితి తెలిసిన అంతర్జాతీయ స్వంచంద సంస్థ తక్షణమే స్పందించి విముక్తికి ఉద్యమించింది. వెటర్నరి డాక్టర్ , పోలీస్ , అటవీశాఖ , స్వచ్చంద సేవకులతో కూడిన 20 మంది ఒక గ్రూప్ గా ఏర్పడింది . బృందంలోని వ్యక్తుల్లో , మానవత్వాన్ని గుర్తించి  , వారిని తన దగ్గరకు రానిచ్చి గొలుసులను సంకెళ్ళను తొలగించడం లో సహకరించింది .ఆ బృందం గంట సేపు శ్రమించి తుప్పు పట్టిన గొలుసులు సంకెళ్ళు తొలగించారు .ఈ సంకెళ్ళను తొలగించిన వెంటనే ఏనుగు కళ్ళల్లో కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో దాని కన్నులనుండి స్రవించిన కన్నీళ్ళు చూచిన వారందరి హృదయాలను కలచివేసినది . యాభై ఏళ్ళనాటి సంకెళ్ళను విముక్తి పొందిన రాజు ..సంరక్షణ కోసం వైల్డ్ లైఫ్ ఎస్ ఓ ఎస్ వారు 17000 డాలర్లు నిధిని సమకూర్చారు .ఇటువంటి మానవత్వం అందరిలో రావాలని ఆకాంక్షిద్ధం .

జంతువులపట్ల క్రురంగా వ్యవహరించే సంస్థలు , వ్యక్తులను జంతు హింసా నివారణా చట్టం క్రింద కటినంగా  శిక్షించాలి. సర్కాస్ , దేవాలయాలు , జూలలో తమ అధీనంలో ఉన్న ఏనుగులు, ఇతర జంతువుల మీద అనవసరపు వత్తిడిని , భారాన్ని తగ్గించే కృషి చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.