Wednesday, 2 August 2017

An elephant rescued from 50 years turture

ఈ గజరాజు పేరు రాజు . సుమారు యాభై సంవత్సరాల క్రితం కొందరు వేటగాళ్ళు ఒక గున్న ఏనుగును దాని తల్లి నుండి వేరుచేసి దానికి రాజు అని పేరు పెట్టారు .ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో ఈ గున్న ఏనుగును ముళ్ళు కలిగిన సంకెళ్ళతో , కొంచంకూడా కదలనీయకుండా బంధించారు .అత్యంత క్రూరుడు తాగుబోతు అయిన మావటి దానికి కనీసం సరియైన మేత, నీరు, నీడ కల్పించని ఆ క్రూరుడు ,సందర్శకులు ఇచ్చిన చిల్లర పైసలు పైనే తప్ప, దాని పోషణ పట్టించుకున్న పాపాన పోలేదు . సందర్శకులు దయతో అందించే నామమాత్రపు పళ్ళు తో పాటు కాగితాలు,  ప్లాస్టిక్ సంచులతో కడుపు నింపుకునే దయనీయ స్థితి లో యాభై సంవత్సరాలుగా గడిపింది.దానికితోడు తుప్పుపట్టి వాడిగా ఉన్న ముళ్ళసంకెళ్ళ వలన ఏర్పడిన గాయాలతో చీము పట్టి నడవలేని పరిస్థితి వలన తీవ్ర ఇబ్బందులకు గురి అయినది . ఏనుగుని పవిత్ర జంతువుగా , వినాయకుని దేవునిగా భావించే మన భారతదేశంలో ఒక గజరాజుకి ఇలాంటి దయనీయ స్థితి ఏర్పడటం మానవత్వానికే తీరని మచ్చ .

రాజు యొక్క దయనీయ పరస్థితి తెలిసిన అంతర్జాతీయ స్వంచంద సంస్థ తక్షణమే స్పందించి విముక్తికి ఉద్యమించింది. వెటర్నరి డాక్టర్ , పోలీస్ , అటవీశాఖ , స్వచ్చంద సేవకులతో కూడిన 20 మంది ఒక గ్రూప్ గా ఏర్పడింది . బృందంలోని వ్యక్తుల్లో , మానవత్వాన్ని గుర్తించి  , వారిని తన దగ్గరకు రానిచ్చి గొలుసులను సంకెళ్ళను తొలగించడం లో సహకరించింది .ఆ బృందం గంట సేపు శ్రమించి తుప్పు పట్టిన గొలుసులు సంకెళ్ళు తొలగించారు .ఈ సంకెళ్ళను తొలగించిన వెంటనే ఏనుగు కళ్ళల్లో కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో దాని కన్నులనుండి స్రవించిన కన్నీళ్ళు చూచిన వారందరి హృదయాలను కలచివేసినది . యాభై ఏళ్ళనాటి సంకెళ్ళను విముక్తి పొందిన రాజు ..సంరక్షణ కోసం వైల్డ్ లైఫ్ ఎస్ ఓ ఎస్ వారు 17000 డాలర్లు నిధిని సమకూర్చారు .ఇటువంటి మానవత్వం అందరిలో రావాలని ఆకాంక్షిద్ధం .

జంతువులపట్ల క్రురంగా వ్యవహరించే సంస్థలు , వ్యక్తులను జంతు హింసా నివారణా చట్టం క్రింద కటినంగా  శిక్షించాలి. సర్కాస్ , దేవాలయాలు , జూలలో తమ అధీనంలో ఉన్న ఏనుగులు, ఇతర జంతువుల మీద అనవసరపు వత్తిడిని , భారాన్ని తగ్గించే కృషి చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.

No comments:

Post a Comment