Wednesday, 2 August 2017

How can trees live if we close the land with cement? Trees only can save us from burning Sun.

చెట్టు మానవ మనుగడకు తొలి మెట్టు. చెట్టు లేని ప్రపంచంలో  మనిషికి  కూడా స్థానం లేదు .  నేనోక చిలకను పెంచాను... ఎగిరిపోయింది. నేనోక ఉడతను పెంచాను.. పారిపోయింది.. నేనోక చెట్టు పెంచాను అంతే చిలక, ఉడతా ఇంకా పక్షులు వచ్చేసాయ్.. చెట్లను పెంచండి " చెట్టు పదికాలాలపాటు పచ్చగుంటే పదిమందికి నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది, స్వఛ్ఛవాయువునిస్తుంది. ఇన్ని ఇస్తున్నా ఆ పచ్చని చెట్టెప్పుడూ తానిన్ని ఇస్తున్నా కదా అని గర్వపడదు.
చెట్ల చుట్టూ సిమెంట్ తో గట్టు వేస్తున్నారు . రోడ్డు పక్కన చెట్లు ఇంటి ఆవరణలో చెట్ట్లు చుట్టూ సిమెంట్ చేయడం వలన ఎంత వర్షం పడినా చెట్టు వేరుకు నీరు అందటం లేదు .మనిషికి ఎంత స్వార్ధం . ఆ చెట్టు నీడలోనే సేదాతీరుతున్నాం కాని ఆ చెట్టు నీరు అందకా ఎండిపోతున్నా పట్టించుకునే వారే లేరు . చెట్టు లేని నాడు మనిషి మనుగడే లేదన్న విషయం గురుతు ఉంచుకొని చెట్టుని కాపాడుకోవలసిన భాద్యత మన అందరిపై ఉంది . పెరిగే ప్రతి చెట్టూ.. ప్రగతికి మెట్టు ! పర్యావరణానికి అదే ఆయువుపట్టు !!

No comments:

Post a Comment