Monday, 4 September 2017

Blue Whale Challenge Game

ఏమిటి ఈ దారుణం . మనం ఎక్కడికి వెళ్తున్నాం .పిల్లలకి ఏమి ఇస్తున్నాం .గేమ్స్ ఆడటం వల్ల చురుకుదనం ఆరోగ్యం ఆనందం ఇస్తుందని విన్నాను కానీ విషాదాన్ని మిగిల్చే ఆటలు కూడా ఉన్నయా...ఎంత దారుణం . గేమ్స్ పేరుతో ప్రాణాలు తీసే హక్కు ఎవరు ఇచ్చారు. గేమ్స, మానసిక ఉత్తేజం పొందేలా పొంధపరచాలి కానీ ప్రాణం తీసేలా కాదు . బ్లూ వేల్ గేమ్ లాంటి ప్రాణాంతక మైన గేమ్స్ వల్ల ఎవరికి ఉపయోగం .ఇలాంటి గేమ్స్ అప్లోడ్ చేసినవారికి ఎలాంటి శిక్ష వేయాలి ...హిప్నటైస్  చేస్తూ మృత్యు మార్గం  చూపించే  ఆట ఇది . చూడటానికి జస్ట్.. మొబైల్ గేమ్ అనిపిస్తుంది కానీ, 10 నుంచి 14 ఏండ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట వేటాడేస్తుంది. భావోద్వేగాలతో పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది

50 రోజులు పాటు సాగే ఈ గేమ్ పిల్లల , పెద్దల మనుసులపై విష ప్రభావం చూపిస్తుంది . ఇది ఒక హిప్నటిక్ గేమ్, ఈ గేమ్ ఆడి రష్యా, బ్రిటన్ లలో ఇప్పటివరకు 130 మంది ప్రాణాలను తీసింది.ఇది  ఇప్పుడు  ఇండియా  పై  కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది .  ఈ గేమ్ పిచ్చిలో పడి ఎంతో మంది మరణించారు. గాయాలపాలైన విషయాలను వినే ఉన్నాం. . బ్లూవేల్ గేమ్స్ ఆడిన వారంతా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ గేమ్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 

ఈ గేమ్ ని రష్యాకి చెందిన యువకుడు 2013 లో స్టార్ట్ చేసాడు . ఇప్పటికే ఈ గేమ్ను సృష్టించిన ఫిల్ , లుడెకిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు . అతడు ఒక మానసిక రోగిగా గుర్తించారు .అతనికి మానసిక వైద్యునితో చికిత్స చేయుస్తున్నారు .F 57 పేరుతో ఈ గేమ్ని స్టార్ట్ చేసారు .ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకొని   ఇన్ స్టాల్ చేసుకుంటే ..మొదట చిన్న చిన్న సవాళ్ళను ఇస్తుంది ..ఆ సవాళ్ళను పూర్తి చేసినవాటికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయాలి. ఈ విధంగా ఒకట్రెండు రోజులు అలవాటయ్యాక గేమ్ స్థానంలో మెంటర్ ప్రవేశిస్తాడు.

ఒకసారి గేమ్ లో ఎంటర్ అయ్యాక మనంతట మనం బయటకి రాని విధంగా ఉచ్చు బిగిస్తాడు .ఉత్కంటతో మనం గేమ్ ఆడుతున్నపుడు వారితో ఎన్నో తప్పులు చేయిస్తాడు. అది  ఆటలో  భాగమని  పిల్లలు  భావిస్తారు  . ..మన వీడియొలను చిత్రాలను బయట పెడతానని బెదిరించి వారి  జీవితాలతో  ఆడటం  మొదలు పెడతాడు. ఎవరికీ చెప్పుకోని విధంగా వారిని చిత్రహింసలకు గురి చేస్తాడు . ఈ గేమ్  మొదలు  పెట్టక  వారు  బానిసగా  మారిపోతారు .టాస్కులు చేయిస్తారు  ఆడిస్తునే  చంపిస్తారు .

ఈ గేమ్ కొనసాగుతున్న నేపద్యంలో భయంకరమైన చిత్రాలను వీడియోలు చూడమనడం , నిద్ర మద్యలో మేల్కొల్పడం లాంటివి మెంటర్ చేయిస్తాడు . ..టాస్క్ టాస్క్ కి మద్య నగ్న చిత్రాలు , డేటింగ్ చేసే విడియోలు పోస్ట్ చేయమని ఆదేశిస్తాడు . ఇవే కాక చేతిపై వివిధ ఆకారాలతో కోసుకోవడం లాంటివి టాస్క్ లో ఇస్తాడు .ఈ విధంగా 49 రోజులు పాటు ఏదో ఒక టాస్క్ ఇస్తూ 50 వ రోజున ఆత్మహత్య చేసుకోవాలని మెంటర్ వారిని ఆదేశిస్తాడు . .

ఇటీవలే ముంబైలో 14 ఏళ్ల మన్‌ప్రీత్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే షోలాపూర్‌కు చెందిన సుధీర్‌ భోస్లే అనే బాలుడు ఈ బ్లూ వేల్‌ గేమ్‌ బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ విషయం తెలియడంతో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సుధీర్‌ను రక్షించగలిగారు.అతను  అడ్మిన్ ఒక  సైకో  అయిఉంటాడని  పోలీసులు అనుమానిస్తున్నారు.

 

పిల్లలు ఏమిచేస్తునారో  వారి  తల్లి  తండ్రులు గమనిస్తూ ఉండాలి జీవతం  విలువ వారికీ   తెలియ జేయాలి . ఏ చాలెంజ్ అయినా ప్రాణం కన్నా ఎక్కువ కాదన్న విషయాన్ని పిల్లలకు తెలియ చెప్పాలి.   మానసిక నిపుణులు మాత్రం ఈ గేమ్ జోలికి వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు..


No comments:

Post a Comment