కుంకుమ హిందువులకు ఎంతో పవిత్రమైనది .నుదుట ఎర్రటి కుంకుమపెట్టుకోవడం వలన ఆచారానికే కాదు . అలంకారంగా కూడా వర్ధిల్లుతోంది.
కనుబొమ్మల మద్య ఉన్న ప్రదేశాన్ని అవిముక్త క్షేత్రమని కూర్మపురాణం చెపుతుంది .నుదుటన బ్రహ్మా దేముడు అధిపతి గా ఉంటాడు .బ్రహ్మా దేముడికి ప్రియతమ రంగు ఎరుపు .అంతేకాక సూర్యకిరణాలు నుదిటి ప్రాంతాన్ని అస్సల తాక కూడదు .
కుంకుమ ఉంగరం వేలుతో పెట్టుకుంటే …మానసిక ప్రశాంతత, శాంతి లభిస్తుంది
నడివేలుతో ధరిస్తే … … ఆయుషు పెరుగుతుంది .
బొటనవేలుతో ……… అనూహ్యమైన శక్తీ
చూపుడువేలుతో ధరిస్తే ….చెడు అలవాట్లు సమసిపోతాయి .ఆద్యాత్మికి చింతన లబిస్తాయి .
ఎర్రటి కుంకుమ మనలోని మనో శక్తిని పెంపొందిస్తుంది. దూరదర్శన్ లో బధిరుల వార్తల్లో ‘ఇండియా ‘ అనే సందర్భంలో వచ్చినపుడు ఆ న్యూస్ రీడర్ నుదుట కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో మద్యవేలును చూపిస్తుంది .అది కుంకుమకు భారతదేశానికి ఉన్న బలీయమైన బంధాన్ని సూచిస్తుంది .
మన సంప్రదాయాలను మనం పాటిస్తూ మన భావితరాలకు ఈ సంప్రదాయాలను వారసత్వం గా ఇవ్వడమే మనం వారికి ఇచ్చిన మంచి కానుక .
No comments:
Post a Comment