వీణావాదం చేస్తూ, పుస్తకం ధరించిన రూపంతో సరస్వతీదేవిగా కనువిందు చేస్తుందీ రోజు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా, త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే ఈ అలంకార ప్రత్యేకతగా చెబుతారు. అజ్ఞానమే అసలైన చీకటి. ఆ చీకటిని పారదోలడానికి విద్యాజ్ఞానం ఎంతో అవసరం. ఆ విద్య మహిళామూర్తిలో దాగి వుంది. పుట్టినప్పుడు పాలివ్వడం నుంచి పెరిగి పెద్దయ్యి ప్రయోజకత్వం సాధించే వరకూ తల్లి నుంచే అనేక విద్యలు నేర్చుకుం టారు. నీ విజయంలో ప్రధాన భాగస్వామ్యం స్త్రీశక్తిదే. ఆమె నేర్పిన విద్యలే ఇవన్నీ. అలాంటి విద్యలకు అధిదే వత ఆమె. ఆమె దర్శన మాత్రం చేత.. అజ్ఞానం తొలిగిపో తుందని సూచిస్తుందీ .
No comments:
Post a Comment