Friday 22 September 2017

Sarannavaraatri Images Greetings (Sri Annapurna Devi Avatharam )

 

దసరా ఉత్సవాలలో నాలుగోరోజు  అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. దసరా శరన్నవరాత్రి  లో బాగంగా ఆశ్వీయుజ శుద్ధచవితినాడు అన్నపూర్ణా  దేవి  అవతారంగా  అలంకరిస్తారు .

అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచిన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.  బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి. “ హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా ” అనే మంత్రం జపించాలి. అమ్మవారికి దద్థ్యన్నం, కట్టెపొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.

అన్నం సాక్షాత్ ఆ అన్నపూర్ణా దేవి మన కందిస్తున్న మహా ప్రసాదం . దయచేసి అన్నం తినకుండా అలగడం , మానేయడం , తోసేడయం వంటివి చేయవద్దు.  అన్నం పరబ్రహ్మ స్వరూపం ....

No comments:

Post a Comment