మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత.దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్సన భాగ్యం కలిగించడం ఆనవాయితీగా వస్తుంది. స్త్రీ శక్తిని కొలవడమే సంపదలనిస్తుందని ..ఆమెని గౌరవించడంలో అష్టైశ్వర్యాలు దాగి ఉన్నాయని తెలుపుతూ కనక దుర్గ్గమ్మ మహాలక్ష్మి అవతారం లో కనిపిస్తుంది . శ్రీమహాలక్ష్మి యొక్క హృదయ పీఠము నందు ఉండే దయయే అనుగ్రహ మూర్తిగా రూపుకట్టి సాక్షాత్కరించిన మూర్తియే శ్రీమహాలక్ష్మి కావునా శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కొరకు శ్రీ మహా విష్ణువు యొక్క హృదయ పీఠము మును అలంకరించి ఆ మహా తల్లిని కొలవవలెను .
అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతి బాధలుండవని భక్తుల విశ్వాసం. సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ధనానికి అధిదేవత మహిళే. ఆమె ఇస్తున్న ధనమే ఇదంతా. అందుకే 'యత్రనార్యంతు పూజ్యంతే' అన్నారు. ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడ సమస్త సంపదలుంటాయని సూచిస్తూ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది. స్త్రీశక్తిని కొలవడమే, సంపదలనిస్తుందని.. ఆమెను గౌరవించడంలోనే అష్టైశ్వర్యాలు దాగి వున్నాయని తెలుపుతూ కనక దుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో కనిపిస్తుంది.
Sunday, 24 September 2017
Sarannavaraatri Images Greetings (Sri Mahalakshmi devi )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment