దసరా శరన్నరాత్రి మహోత్సవంలో భాగంగా ఆశ్వయుజ శుద్ద విధియ నాడు కనకదుర్గమ్మను ... "శ్రీ గాయత్రిదేవి" గా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేద మాతగా ప్రసిద్ధి చెందింది.గాయత్రిమాత. ముక్తా, విద్రుమ, హేమనీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే దేవత గాయత్రీదేవి. గాయత్రీ దేవి శిరస్సలో బ్రహ్మ, హృదయంలో విష్ణు, శిఖలో రుద్రుడు ఉంటారని నమ్ముతారు. అందుకే త్రిమూర్తి స్వరూపంగా గాయత్రిని కొలుస్తారు. గాయత్రీని దర్శిస్తే ఆరోగ్యంతో పాటు సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని ప్రతీతి. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు.
సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకూ నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. ప్రతి ముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు,
చంద్రకళతో కూడిన కిరీటము కలదియు,
పరమార్థ వివరణాత్మక బీజాక్షరములు కలిగినదియు,
వరద మరియు అభయ ముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైనా గాయత్రీదేవి దేవి నేడు దర్శనమిస్తుంది..
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత
అమ్మవారు 24 తత్త్వములతో, 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రభోదిస్తారు.
No comments:
Post a Comment