Sunday 17 September 2017

Red Kumkum bindi on forehead not only gives beautiful look but also has health and traditional values



కుంకుమ హిందువులకు ఎంతో పవిత్రమైనది .నుదుట ఎర్రటి కుంకుమపెట్టుకోవడం వలన ఆచారానికే కాదు . అలంకారంగా కూడా వర్ధిల్లుతోంది.



కనుబొమ్మల మద్య ఉన్న ప్రదేశాన్ని అవిముక్త క్షేత్రమని కూర్మపురాణం చెపుతుంది .నుదుటన బ్రహ్మా దేముడు అధిపతి గా ఉంటాడు .బ్రహ్మా దేముడికి ప్రియతమ రంగు ఎరుపు .అంతేకాక సూర్యకిరణాలు నుదిటి ప్రాంతాన్ని అస్సల తాక కూడదు .



 



కుంకుమ ఉంగరం వేలుతో పెట్టుకుంటే ...మానసిక ప్రశాంతత, శాంతి లభిస్తుంది



నడివేలుతో ధరిస్తే ...   ... ఆయుషు  పెరుగుతుంది .



బొటనవేలుతో .........       అనూహ్యమైన శక్తీ



చూపుడువేలుతో ధరిస్తే ....చెడు అలవాట్లు సమసిపోతాయి .ఆద్యాత్మికి చింతన లబిస్తాయి .



ఎర్రటి కుంకుమ మనలోని మనో శక్తిని పెంపొందిస్తుంది.  దూరదర్శన్ లో బధిరుల వార్తల్లో 'ఇండియా ' అనే సందర్భంలో వచ్చినపుడు ఆ న్యూస్ రీడర్ నుదుట కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో మద్యవేలును చూపిస్తుంది .అది కుంకుమకు భారతదేశానికి ఉన్న బలీయమైన బంధాన్ని సూచిస్తుంది .



 



మన సంప్రదాయాలను మనం పాటిస్తూ మన భావితరాలకు ఈ సంప్రదాయాలను వారసత్వం గా ఇవ్వడమే మనం వారికి ఇచ్చిన మంచి కానుక .


No comments:

Post a Comment