Sunday, 22 October 2017
Saturday, 21 October 2017
Friday, 20 October 2017
Karthikamasam Quotations and Images
When the pride of man is dissolved like camphor, the form of God is clearly visible in that light.
Wednesday, 18 October 2017
Monday, 16 October 2017
Saturday, 14 October 2017
Friday, 13 October 2017
Thursday, 12 October 2017
Tuesday, 10 October 2017
Sunday, 8 October 2017
Atla Thaddi Quotations and Greetings
అందరికీ "అట్లతద్ది" శుభాకాంక్షలు. ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది.చంద్రకళలో గౌరీదేవిని ఆరాధించే తిధి ఇది.తెల్లవారున లేచి స్నానమాచరించి తూర్పు దిక్కున మండపం ఏర్పాటుచేసి గౌరీ పూజ ఆచరిస్తారు . 11 రకాల పూలు , ఆకులుతో 11 ముడులు వేసిన తోరాన్ని గౌరీ దేవి ముందుంచి పూజ చేసి, పూజ అయిన తదుపరి ముతైదువులను కూర్చుండబెట్టి ముత్తైదులకు వాయినాలు ఇప్పిస్తారు.
అట్లతద్ది సందేశం! స్నేహభావం తో అందరూ కలసిమెలసి ఉండాలనీ , దానం చెప్పుకుంటే పుణ్యం పోతుంది అందుకే వాయనం ఇచ్చినపుడు చెంగు మూసి ఇస్తారు ..దానం ఆవిధంగా చేయాలనీ చెప్పడం .దానం గ్నుప్తంగా చేయాలి . మనదగ్గర ఉన్నదాన్ని ఎదుటి వారికి ఇవ్వాలి . పది మందికి పంచాలి అని అట్లతద్ది చెపుతుంది పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత అని ఇట్టే అర్థం అవుతుంది
Saturday, 30 September 2017
Good Night
Corrosion which born from iron will eat iron like
Sinner doing sinful deeds forgets the flames he is burning but one day
he will also burn in the same flames
Sarannavaraatri Images Greetings (Sri Raja Rajeswari Avatharam )
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.
Friday, 29 September 2017
Sarannavaraatri Images Greetings (Sri రాజ Rajeswari Avatharam )
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.
Sarannavaraatri Images Greetings (Sri Mahishasura mardhani devi )
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది
Thursday, 28 September 2017
Sarannavaraatri Images Greetings (Sri Mahishasura mardhani devi )Sarannavaraatri Images Greetings (Sri Durga devi )
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.
అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది
Wednesday, 27 September 2017
Sarannavaraatri Images Greetings (Sri Durga devi )
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.
పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.
Sarannavaraatri Images Greetings (Sri Saraswathi devi )
వీణావాదం చేస్తూ, పుస్తకం ధరించిన రూపంతో సరస్వతీదేవిగా కనువిందు చేస్తుందీ రోజు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా, త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే ఈ అలంకార ప్రత్యేకతగా చెబుతారు. అజ్ఞానమే అసలైన చీకటి. ఆ చీకటిని పారదోలడానికి విద్యాజ్ఞానం ఎంతో అవసరం. ఆ విద్య మహిళామూర్తిలో దాగి వుంది. పుట్టినప్పుడు పాలివ్వడం నుంచి పెరిగి పెద్దయ్యి ప్రయోజకత్వం సాధించే వరకూ తల్లి నుంచే అనేక విద్యలు నేర్చుకుం టారు. నీ విజయంలో ప్రధాన భాగస్వామ్యం స్త్రీశక్తిదే. ఆమె నేర్పిన విద్యలే ఇవన్నీ. అలాంటి విద్యలకు అధిదే వత ఆమె. ఆమె దర్శన మాత్రం చేత.. అజ్ఞానం తొలిగిపో తుందని సూచిస్తుందీ .
Monday, 25 September 2017
Sunday, 24 September 2017
Sarannavaraatri Images Greetings (Sri Mahalakshmi devi )
మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత.దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్సన భాగ్యం కలిగించడం ఆనవాయితీగా వస్తుంది. స్త్రీ శక్తిని కొలవడమే సంపదలనిస్తుందని ..ఆమెని గౌరవించడంలో అష్టైశ్వర్యాలు దాగి ఉన్నాయని తెలుపుతూ కనక దుర్గ్గమ్మ మహాలక్ష్మి అవతారం లో కనిపిస్తుంది . శ్రీమహాలక్ష్మి యొక్క హృదయ పీఠము నందు ఉండే దయయే అనుగ్రహ మూర్తిగా రూపుకట్టి సాక్షాత్కరించిన మూర్తియే శ్రీమహాలక్ష్మి కావునా శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కొరకు శ్రీ మహా విష్ణువు యొక్క హృదయ పీఠము మును అలంకరించి ఆ మహా తల్లిని కొలవవలెను .
అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతి బాధలుండవని భక్తుల విశ్వాసం. సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం. ధనానికి అధిదేవత మహిళే. ఆమె ఇస్తున్న ధనమే ఇదంతా. అందుకే 'యత్రనార్యంతు పూజ్యంతే' అన్నారు. ఎక్కడ మహిళ గౌరవించబడుతుందో అక్కడ సమస్త సంపదలుంటాయని సూచిస్తూ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది. స్త్రీశక్తిని కొలవడమే, సంపదలనిస్తుందని.. ఆమెను గౌరవించడంలోనే అష్టైశ్వర్యాలు దాగి వున్నాయని తెలుపుతూ కనక దుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో కనిపిస్తుంది.
Friday, 22 September 2017
Sarannavaraatri Images Greetings (Sri Lalitha devi )
దుర్గా దేవిని శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారం లో అలంకరిస్తారు . .త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.
చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి.
కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
Sarannavaraatri Images Greetings (Sri Gayatri Devi Avatharam )
దసరా శరన్నరాత్రి మహోత్సవంలో భాగంగా ఆశ్వయుజ శుద్ద విధియ నాడు కనకదుర్గమ్మను ... "శ్రీ గాయత్రిదేవి" గా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేద మాతగా ప్రసిద్ధి చెందింది.గాయత్రిమాత. ముక్తా, విద్రుమ, హేమనీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే దేవత గాయత్రీదేవి. గాయత్రీ దేవి శిరస్సలో బ్రహ్మ, హృదయంలో విష్ణు, శిఖలో రుద్రుడు ఉంటారని నమ్ముతారు. అందుకే త్రిమూర్తి స్వరూపంగా గాయత్రిని కొలుస్తారు. గాయత్రీని దర్శిస్తే ఆరోగ్యంతో పాటు సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని ప్రతీతి. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు.
సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకూ నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. ప్రతి ముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు,
చంద్రకళతో కూడిన కిరీటము కలదియు,
పరమార్థ వివరణాత్మక బీజాక్షరములు కలిగినదియు,
వరద మరియు అభయ ముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైనా గాయత్రీదేవి దేవి నేడు దర్శనమిస్తుంది..
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత
అమ్మవారు 24 తత్త్వములతో, 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రభోదిస్తారు.
Sarannavaraatri Images Greetings (Sri Annapurna Devi Avatharam )
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచిన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి. “ హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా ” అనే మంత్రం జపించాలి. అమ్మవారికి దద్థ్యన్నం, కట్టెపొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణం చేయాలి.
అన్నం సాక్షాత్ ఆ అన్నపూర్ణా దేవి మన కందిస్తున్న మహా ప్రసాదం . దయచేసి అన్నం తినకుండా అలగడం , మానేయడం , తోసేడయం వంటివి చేయవద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం ....
Sarannavaraatri Images Greetings (Sri Gayatri Devi Avatharam )
దసరా శరన్నరాత్రి మహోత్సవంలో భాగంగా మూడవరోజు ఆశ్వయుజ శుద్ద విధియ నాడు కనకదుర్గమ్మను ... "శ్రీ గాయత్రిదేవి" గా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేద మాతగా ప్రసిద్ధి చెందింది.గాయత్రిమాత. ముక్తా, విద్రుమ, హేమనీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే దేవత గాయత్రీదేవి. గాయత్రీ దేవి శిరస్సలో బ్రహ్మ, హృదయంలో విష్ణు, శిఖలో రుద్రుడు ఉంటారని నమ్ముతారు. అందుకే త్రిమూర్తి స్వరూపంగా గాయత్రిని కొలుస్తారు. గాయత్రీని దర్శిస్తే ఆరోగ్యంతో పాటు సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని ప్రతీతి. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు.
సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకూ నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది. ప్రతి ముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు,
చంద్రకళతో కూడిన కిరీటము కలదియు,
పరమార్థ వివరణాత్మక బీజాక్షరములు కలిగినదియు,
వరద మరియు అభయ ముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైనా గాయత్రీదేవి దేవి నేడు దర్శనమిస్తుంది..
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత
అమ్మవారు 24 తత్త్వములతో, 5 ముఖములు కలిగిన శక్తిగా ప్రభోదిస్తారు.
Thursday, 21 September 2017
Wednesday, 20 September 2017
Tuesday, 19 September 2017
Sunday, 17 September 2017
Good Morning Quotations and Images
Red Kumkum bindi on forehead not only gives beautiful look but also has health and traditional values
Remembering a happy experience Quotations and Images
You can improve your emotions ...By thinking of something Joyful or singing a song or remembering a happy experience
Red Kumkum bindi on forehead not only gives beautiful look but also has health and traditional values
Saturday, 16 September 2017
Wednesday, 13 September 2017
Love Quotations and Images
Tuesday, 12 September 2017
Lord Hanuman Quotations and images
one can learn from Hanuman how to fulfil a work with endurance and skill
Sunday, 10 September 2017
Friday, 8 September 2017
Thursday, 7 September 2017
Bhagavad Gita Quotations
ఏదైనా సంఘటన వలన మనిషి భయపడితే అది వారి పరాజయమే అవుతుంది .అలాగే ఏదైనా కోల్పోయినప్పటికీ శాంతంగా స్థిరంగా ఉంటే అది అతని గెలుపే అవుతుంది .సమయమే పరివర్తన తెస్తుంది .అధర్మం చేసిన వారికి దండన లభిస్తుంది . ధర్మ ద్వజం మళ్ళి రెపరెప లాడుతుంది
Wednesday, 6 September 2017
Monday, 4 September 2017
Blue Whale Challenge Game
ఏమిటి ఈ దారుణం . మనం ఎక్కడికి వెళ్తున్నాం .పిల్లలకి ఏమి ఇస్తున్నాం .గేమ్స్ ఆడటం వల్ల చురుకుదనం ఆరోగ్యం ఆనందం ఇస్తుందని విన్నాను కానీ విషాదాన్ని మిగిల్చే ఆటలు కూడా ఉన్నయా...ఎంత దారుణం . గేమ్స్ పేరుతో ప్రాణాలు తీసే హక్కు ఎవరు ఇచ్చారు. గేమ్స, మానసిక ఉత్తేజం పొందేలా పొంధపరచాలి కానీ ప్రాణం తీసేలా కాదు . బ్లూ వేల్ గేమ్ లాంటి ప్రాణాంతక మైన గేమ్స్ వల్ల ఎవరికి ఉపయోగం .ఇలాంటి గేమ్స్ అప్లోడ్ చేసినవారికి ఎలాంటి శిక్ష వేయాలి ...హిప్నటైస్ చేస్తూ మృత్యు మార్గం చూపించే ఆట ఇది . చూడటానికి జస్ట్.. మొబైల్ గేమ్ అనిపిస్తుంది కానీ, 10 నుంచి 14 ఏండ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట వేటాడేస్తుంది. భావోద్వేగాలతో పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది
50 రోజులు పాటు సాగే ఈ గేమ్ పిల్లల , పెద్దల మనుసులపై విష ప్రభావం చూపిస్తుంది . ఇది ఒక హిప్నటిక్ గేమ్, ఈ గేమ్ ఆడి రష్యా, బ్రిటన్ లలో ఇప్పటివరకు 130 మంది ప్రాణాలను తీసింది.ఇది ఇప్పుడు ఇండియా పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది . ఈ గేమ్ పిచ్చిలో పడి ఎంతో మంది మరణించారు. గాయాలపాలైన విషయాలను వినే ఉన్నాం. . బ్లూవేల్ గేమ్స్ ఆడిన వారంతా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ గేమ్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.
ఈ గేమ్ ని రష్యాకి చెందిన యువకుడు 2013 లో స్టార్ట్ చేసాడు . ఇప్పటికే ఈ గేమ్ను సృష్టించిన ఫిల్ , లుడెకిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు . అతడు ఒక మానసిక రోగిగా గుర్తించారు .అతనికి మానసిక వైద్యునితో చికిత్స చేయుస్తున్నారు .F 57 పేరుతో ఈ గేమ్ని స్టార్ట్ చేసారు .ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకుంటే ..మొదట చిన్న చిన్న సవాళ్ళను ఇస్తుంది ..ఆ సవాళ్ళను పూర్తి చేసినవాటికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయాలి. ఈ విధంగా ఒకట్రెండు రోజులు అలవాటయ్యాక గేమ్ స్థానంలో మెంటర్ ప్రవేశిస్తాడు.
ఒకసారి గేమ్ లో ఎంటర్ అయ్యాక మనంతట మనం బయటకి రాని విధంగా ఉచ్చు బిగిస్తాడు .ఉత్కంటతో మనం గేమ్ ఆడుతున్నపుడు వారితో ఎన్నో తప్పులు చేయిస్తాడు. అది ఆటలో భాగమని పిల్లలు భావిస్తారు . ..మన వీడియొలను చిత్రాలను బయట పెడతానని బెదిరించి వారి జీవితాలతో ఆడటం మొదలు పెడతాడు. ఎవరికీ చెప్పుకోని విధంగా వారిని చిత్రహింసలకు గురి చేస్తాడు . ఈ గేమ్ మొదలు పెట్టక వారు బానిసగా మారిపోతారు .టాస్కులు చేయిస్తారు ఆడిస్తునే చంపిస్తారు .
ఈ గేమ్ కొనసాగుతున్న నేపద్యంలో భయంకరమైన చిత్రాలను వీడియోలు చూడమనడం , నిద్ర మద్యలో మేల్కొల్పడం లాంటివి మెంటర్ చేయిస్తాడు . ..టాస్క్ టాస్క్ కి మద్య నగ్న చిత్రాలు , డేటింగ్ చేసే విడియోలు పోస్ట్ చేయమని ఆదేశిస్తాడు . ఇవే కాక చేతిపై వివిధ ఆకారాలతో కోసుకోవడం లాంటివి టాస్క్ లో ఇస్తాడు .ఈ విధంగా 49 రోజులు పాటు ఏదో ఒక టాస్క్ ఇస్తూ 50 వ రోజున ఆత్మహత్య చేసుకోవాలని మెంటర్ వారిని ఆదేశిస్తాడు . .
ఇటీవలే ముంబైలో 14 ఏళ్ల మన్‌ప్రీత్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే షోలాపూర్‌కు చెందిన సుధీర్ భోస్లే అనే బాలుడు ఈ బ్లూ వేల్ గేమ్ బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ విషయం తెలియడంతో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సుధీర్‌ను రక్షించగలిగారు.అతను అడ్మిన్ ఒక సైకో అయిఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Thursday, 31 August 2017
Tuesday, 29 August 2017
Friday, 25 August 2017
Tuesday, 22 August 2017
Monday, 21 August 2017
Sunday, 20 August 2017
Vinayaka chavithi Greetings and images 2017
Lord Ganesha divinity in complete conquerance on strength knowledge wealth n happiness
Saturday, 19 August 2017
Thursday, 17 August 2017
Wednesday, 16 August 2017
Bhagavad Gita Quotations
ఈ జగత్తులో జన్మించే ప్రతీ శిశువు ఎటువంటి గుణ దోషాలు లేకుండా జన్మిస్తాడు .జన్మతహ పిల్లల్లో ఎటువంటి గుణదోషాలు ఉండవు . .వాని అంతరాత్మలో ఎటువంటి సత్ సంస్కార లక్షణాలు కానీ దుస్సంస్కార లక్షణాలు కానీ ఉండవు . .తమ తల్లి తండ్రుల నోట నిరంతరమూ వినే మాటల యొక్క ప్రభావమే వాళ్ళ సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చి దిద్దు తుంది . అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానాని కున్నసంస్కారం లోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి..పిల్లలు చెడు మార్గంలో పయనిస్తున్నప్పుడు, తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందా అని వారి హృదయం వారిని నిలదీసి అడుగుతుంది . తమ సంతానం ధర్మబద్దం గానూ , సంస్కారవంతులుగానూ ఉండాలని ఆశించే ప్రతీ తల్లి తండ్రులూ ముందుగా తన మనసులోని కోరికలను నియంత్రించు కోవడం అనివార్యం